ప్రస్తుతం ఇండియన్ సినిమా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ భారీ మల్టీస్టారర్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది “వార్ 2” అనే చెప్పాలి. బాలీవుడ్ నుంచి గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) మన టాలీవుడ్ నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) లు ప్రధాన పాత్రల్లో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమా ఇది కాగా అభిమానులు ఎప్పుడు నుంచో చాలా ఎగ్జైటెడ్ గా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు.
అయితే ఇలాంటి సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఇప్పుడు వరకు ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేకుండా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. ఎన్టీఆర్ పై కానీ హృతిక్ పై గాని అంతెందుకు సినిమా టైటిల్ కూడా ఏంటి అనేది అఫీషియల్ లోగో కూడా మేకర్స్ ఇచ్చింది లేదు. అయితే ఇపుడు ఇవన్నీ ఎప్పుడు నుంచి బయటకి వస్తాయి అనేది తెలుస్తుంది.
లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ రానున్న ఏప్రిల్ నెల నుంచి వార్ 2 ట్రీట్స్ రావడం మొదలు కానున్నట్టుగా తెలుస్తుంది. దీనితో వార్ 2 అప్డేట్స్ సమ్మర్ స్పెషల్ గా మొదలు కానున్నాయి అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి యష్ రాజ్ ఫిల్మ్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తుండగా ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం కానుకగా రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతుంది.