“ఆచార్య” ఎందుకు రిలీజ్ అవ్వట్లేదో సునిశిత క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్.!

Published on Sep 20, 2021 7:05 am IST


తెలుగు ఆడియెన్స్ ఎప్పుడు నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “లవ్ స్టోరీ” నిన్ననే అతిరధ మహారథుల సమక్షంలో చాలా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు. అయితే ఈ చిత్ర యూనిట్ అంతటికీ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటుగా ప్రస్తుతం టాలీవుడ్ ఎదుర్కొంటున్న సీరియస్ ఇష్యూ పై కూడా లవ్ స్టోరీ వేదిక నుంచి గొంతు విప్పారు.

రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రస్తుతం మారుతున్న పరిస్థితులు రీత్యా టాలీవుడ్ పరిశ్రమని ఆదుకోవాలని ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి వినమ్రంగా విన్నవించుకుంటున్నానని చెప్పడం మరింత ఆసక్తిగా మారింది. ఇప్పుడు సినిమా కాస్ట్ పెరిగింది, బడ్జెట్ కూడా పెరిగుతుంది. అలా కాకుండా అందరూ అత్యధిక రెమ్యునరేషన్ లు తీసుకుంటున్నారని పలు నిర్ణయాలు తీసుకోవడం సరి కాదని, అలా తీసుకునే హీరోలు ముగ్గురు నలుగురు మాత్రమే ఉన్నారు వారి కోసం అని చెప్పి నిర్ణయం తీసుకుంటే మిగతా ఇండస్ట్రీ అంతా కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది అని తెలిపారు.

అంతే కాకుండా ఈ కొత్త నిర్ణయం మూలన సినిమా పూర్తయ్యాక ఆ రెవెన్యూ అంతా కూడా వస్తుందా లేదా అన్న ఆందోళన ప్రతి ఒక్కరిలో ఉందని అందుకే నా ఆచార్య సినిమా కూడా రిలీజ్ ఎప్పుడు చెయ్యాలో అర్థం కవట్లేదని అసలు విషయం తెలిపారు. మేము ఎప్పుడు ఆడియెన్స్ ని అభిమానులని ఎంటర్టైన్ చెయ్యాలనే కోరుకుంటాం అని, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏదైనా విపత్తు వచ్చినపుడు మొట్టమొదటగా స్పందించేది సినీ పరిశ్రమే అని అందుకే దయచేసి ఇది తన విన్నపంగా వినమ్రంగా తెలియజేస్తున్నానని మెగాస్టార్ తెలిపారు.

సంబంధిత సమాచారం :