చిరు, బాలయ్యతో సినిమాలు అలా మిస్సయ్యాయి – నటి గౌతమి

Published on Apr 29, 2021 4:00 pm IST

ఎందరో ప్రముఖ సీనియర్ నటులను నటీమణులను ఈటీవీ ఛానెల్లో ప్రసారం అయ్యే “ఆలీతో సరదాగా” కార్యక్రమం ద్వారా మళ్ళీ పరిచయం చేసి నేటి తరం వారికి అప్పటి ముచ్చట్లు తెలియని విజ్ఞ్యానాన్ని పంచుతూ వస్తుంది. మరి తాజాగా గత వారం అలనాటి గ్లామరస్ అండ్ స్టార్ నటి గౌతమి స్పెషల్ గెస్ట్ గా వచ్చి వ్యాఖ్యాత ఆలీతో ముచ్చటించారు. మరి ఈ ఎపిసోడ్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలనే తెలిపారు.

అయితే అప్పట్లోనే ఇండస్ట్రీని ఒక ఊపు ఊపుతున్న మెగాస్టార్ చిరంజీవితో ఒకటి కాదు రెండు మూడు సినిమాలు మిస్ చేసుకున్నారట. వాటిలో చిరు హిట్ సినిమా ‘స్టేట్ రౌడీ’ కూడా ఉందట. అలాగే అప్పట్లోనే నందమూరి బాలకృష్ణతో ‘నారి నారి నడుమ మురారి’ సినిమా కూడా చెయ్యాల్సి ఉండగా కాల్షీట్స్ సెట్ కాక ఇద్దరు హీరోలతో సినిమాలు మిస్సయ్యాయని తెలిపారు. అలాగే చిరుతో సినిమా అనుకున్న ప్రతిసారి సరిగ్గా రజినీకాంత్ తో ఆల్రెడీ సినిమా స్టార్ట్ చేసి ఉండడం వల్ల చిరంజీవితో ప్రతిసారి సినిమా కుదరలేదు అని గౌతమి ఈ షో ద్వారా తెలిపారు.

సంబంధిత సమాచారం :