తారక్ లో అంత మార్పుకి కారణం ఇదేనా!?

తారక్ లో అంత మార్పుకి కారణం ఇదేనా!?

Published on Apr 17, 2025 8:05 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇపుడు బాలీవుడ్ లో భారీ చిత్రం వార్ 2 చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తో అలాగే కొరటాల శివతో దేవర పార్ట్ 2 లని చేయనున్నాడు. అయితే ఇటీవల గమనించినట్టు అయితే తారక్ లో చాలా మార్పుని మనం గమనించవచ్చు. తారక్ చాలా చిక్కిపోయి సన్నగా కనిపించడం జరిగింది.

అయితే ఇదంతా ఊరికే జరిగింది కాదట. తాను తన నెక్స్ట్ సినిమా కోసమే ఈ లుక్ ని సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఎన్టీఆర్ విషయంలో అభిమానులు కంగారు పడాల్సిన పని లేదట. మరి ఈ లుక్ లో ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ ఏం ప్లాన్ చేస్తున్నాడో వేచి చూడాలి మరి. ఇక ఈ చిత్రానికి హోంబళే ఫిల్మ్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తుండగా అతి త్వరలోనే తారక్ షూటింగ్ సెట్స్ లో దిగనున్నాడు. అలాగే వచ్చే ఏడాది జనవరి 9 రిలీజ్ కి లాక్ చేసి ఉంచారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు