నాని నిర్మాత అందుకే తప్పుకున్నారా?

Published on Oct 20, 2020 1:03 pm IST

లేటెస్ట్ గా నాచురల్ స్టార్ నాని తన 25 వ సినిమాగా “వి” చిత్రంతో పలకరించి ఓటిటి ప్రేక్షకులను అలరించారు. అయితే ఈ ప్రాజెక్ట్ లైన్ లో ఉండగానే ఇద్దరు టాలెంటెడ్ దర్శకులుతో మరో రెండు చిత్రాలు ఓకే చేసేసారు. వాటిలో ప్రముఖ నిర్మాత నాగవంశితో ప్రకటించిన చిత్రం “శ్యామ్ సింగ రాయ్”. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే మంచి అంచనాలు ఏర్పర్చుకున్న ఈ చిత్రం నుంచి నిర్మాత నాగదేవర వంశీ తప్పుకున్నారని తెలిసిందే. కానీ అందుకు గల కారణం ఏమిటి అన్నది ఇపుడు గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఆ టాక్ ప్రకారం బడ్జెట్ విషయంలో చిన్న అవకతవకలు వచ్చి నాగవంశీ చేతులు నుంచి వెంకట్ బోయినపల్లి చేతులకు మళ్లింది.

ఇంకా లోతుగా వెళ్తే నాని ఈ చిత్రాన్ని మంచి డీసెంట్ బడ్జెట్ తో నిర్మాంచాలని సూచించారట. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అయ్యే పని కాదని ఆ నిర్మాణ సంస్థ వారు తప్పుకున్నారట. కానీ నాని ఈ సినిమాకు ఖచ్చితంగా లాభాలు తెచ్చి పెడుతుందనే నమ్మకంతోనే బడ్జెట్ విషయంలో రాజీ పడకూడదు అనుకున్నారట. అందుకే ఈ విషయం మూలాన నిర్మాత తప్పుకున్నారట.

సంబంధిత సమాచారం :

More