“రాధే శ్యామ్” షూట్ మళ్ళీ అందుకే అట.?

Published on Apr 18, 2021 5:00 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ పీరియాడిక్ వండర్ చిత్రం “రాధే శ్యామ్”. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం నిజానికి ఎప్పుడో పూర్తయిన సంగతి తెలిసిందే. కానీ మళ్ళీ ఊహించని విధంగా మేకర్స్ షూటింగ్ ను స్టార్ట్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇందుకు గల్ కారణం ఏమిటి అన్నది ఇపుడు తెలుస్తుంది.

నిజానికి ఈ చిత్రంలో మిగిలి ఉన్న షూట్ ఏదీ లేదట కానీ కొన్ని కీలక సన్నివేశాలను మళ్ళీ ప్రభాస్ రీషూట్ చెయ్యాలని సూచించడంతో మళ్ళీ చేస్తున్నారట. ప్రభాస్ ఏ సీన్స్ నచ్చక రీషూట్ చెయ్యమన్నారో తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి మొత్తం ముగ్గురు సంగీత దర్శకులు పని చేస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :