పవన్ “వకీల్ సాబ్” స్ట్రీమింగ్ ఇంత త్వరగా అందుకే.?

Published on Apr 28, 2021 8:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్”. బాలీవుడ్ చిత్రం పింక్ కు రీమేక్ గా దర్శకుడు శ్రీరామ్ వేణు చాలానే మార్పులు చేర్పులు చేసి ప్లాన్ చేసారు. దీనితో ఈ అవుట్ పుట్ కి అవుట్ స్టాండింగ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే మళ్ళీ కరోనా తీవ్ర రూపం దాల్చడంతోనే వసూళ్లపై కాస్త దెబ్బ కూడా పడింది.

దీనితో వకీల్ సాబ్ కూడా త్వరగానే స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది అని ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ ఓటిటి నిపుణులు అప్పుడే కాదు వచ్చే మే చివరి నాటికి సినిమా రావచ్చని తెలియజేసారు. కానీ ఉహించని విధంగా మేకర్స్ వచ్చే ఏప్రిల్ 30నే ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ రానున్నట్టుగా మేకర్స్ ప్రకటించేశారు. అయితే ఇందుకు కారణం ఇప్పుడు తెలుస్తుంది.

కాస్త లేట్ గా కంటే త్వరగా స్ట్రీమింగ్ కు వస్తే ప్రైమ్ నుంచి ఎక్కువ మొత్తంలో ధర వచ్చే అవకాశం ఉంది అని అందుకే మేకర్స్ ఇలా చేసి ఉండొచ్చని తెలుస్తుంది. అలాగే పవన్ ఫ్యాన్స్ కూడా ఈ నిర్ణయానికి ఇలాంటి సమయంలో తీసుకోడం కరెక్ట్ అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ చిత్రంలో నివేతా థామస్, అంజలి మరియు అనన్య నాగళ్ళలు కీలక పాత్రల్లో నటించగా థమన్ సంగీతం అందించారు. అలాగే దిల్ రాజు మరియు శిరీష్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :