వచ్చే ఏడాది 4 సినిమాలు రిలీజ్ ప్లాన్ తో యంగ్ హీరో

Vishwak Sen

మన టాలీవుడ్ యంగ్ హీరోస్ లో యూత్ లో అయితే మంచి ఫాలోయింగ్ ఉన్న వారిలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కూడా ఒకడు. మరి విశ్వక్ సేన్ హీరోగా ఇప్పుడు పలు చిత్రాలు చేస్తుండగా వాటిలో ఈ ఏడాదిలో అయితే “దాస్ కా ధమ్కీ” రిలీజ్ అయ్యింది. అయితే రెండో సినిమా “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” కూడా రావాల్సి ఉంది కానీ మేకర్స్ దానిని వచ్చే ఏడాదికి వాయిదా వేశారు.

దీనితో ఈ ఏడాది తన నుంచి ఎలాగైనా రెండు సినిమాలు రిలీజ్ ఉండాలి అనుకున్నాను అని కానీ ఒక్క సినిమా మాత్రమే అందించగలిగాను అని విశ్వక్ తన సోషల్ మీడియాలో తెలిపాడు. తన కెరీర్ 10వ సినిమా సెట్స్ నుంచి పోస్ట్ పెడుతూ వచ్చే ఏడాది ఏడాదిలో మాత్రం తన నుంచి నాలుగు సినిమాలు రిలీజ్ ఉండేలా చూసుకుంటాను అని తన ఫ్యాన్స్ కి ప్రామిస్ చేస్తున్నాడు. అలాగే 2024 మాత్రం మామూలుగా ఉండదని కూడా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు.

Exit mobile version