ఇంటర్వ్యూ: హర్షిత చౌదరి-తెలుగు హీరోయిన్లకు అలాంటి హద్దులు ఉంటాయి.

Published on Nov 14, 2019 3:42 pm IST


విశ్వాన్థ్, హర్షిత చౌదరి హీరోహీరోయిన్లుగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ తోలుబొమ్మలాట. నూతన దర్శకుడు విశ్వనాథ్ మాగంటి దర్శకత్వంలో తెరకెక్కగా, దుర్గా ప్రసాద్ మాగంటి నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీతో వెండి తెరకు హీరోయిన్ గా పరిచయమవుతున్న హర్షిత చౌదరి మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

 

మీ గురించి చెప్పండి?

నేను మాస్ కమ్యూనికేషన్ స్టూడెంట్ ని, హైదరాబాద్ లో సెటిలైన ఆంధ్రా ఫ్యామిలీ మాది. నేను నటించిన కొన్నియాడ్స్ ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. అవి చూసిన కొందరు నా పోర్ట్పోలియో డైరెక్టర్ కి చూపించడంతో ఆడిషన్స్ ద్వారా నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. అలా మొదటి సారి హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది.

 

ఈ మూవీలో మీ పాత్ర ఎలా ఉంటుంది?
అంత స్ట్రాంగ్ గా నా పాత్ర ఉండదు. ఇన్నోసెంట్ మరియు కామ్ గా ఉండే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అమ్మాయిగా కనిపిస్తాను. తన బావ పట్ల ప్రేమ అభిమానం కలిగి ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఉన్న ప్రతి అమ్మాయి నేచర్ ని ప్రతిబింబిచేలా నా పాత్ర ఉంటుంది.

 

ఎలాంటి పాత్రలు చేయాలని అనుకుంటున్నారు?
నేను పాత్రలు ఎంచుకొనే పొజిషన్ కి ఇంకా రాలేదు. వచ్చిన పాత్రలు నా లిమిట్స్ లో ఉన్నాయా?, పాత్ర చేయగలనా… లేదా? అని చూసి ఎంపిక చేసుకుంటాను.

 

పాత్రను ఎంచుకోవడంలో ఎటువంటి లిమిటేషన్స్ పెట్టుకుంటారు?
డ్రెస్సింగ్ అనేది నాకు కంఫర్ట్ గా ఉండాలి. అలాగే హీరో హీరోయిన్ల మధ్య వచ్చే ఇంటిమేషన్, రొమాంటిక్ సన్నివేశాల విషయంలో నాకు కొన్ని లిమిటేషన్స్ వున్నాయి. తెలుగు హీరోయిన్లకు అలాంటివి చాలా హద్దులు ఉంటాయి.

 

సినిమాలలోకి రావడానికి మీకు స్ఫూర్తి ఎవరు?
చాలా మంది ఉన్నారు, ఎవరో ఒకరి పేరు చెప్పలేను. అప్పట్లో సావిత్రిగారు మరియు భానుమతి గారి నటనంటే చాలా ఇష్టం. అలాగే సౌందర్య గారు కూడా నాకు స్ఫూర్తి ఇచ్చారు.

 

ఈ మూవీతో మీరు నేర్చుకున్న విషయాలేమిటి
పాజిటివ్ గా ఉండటం అలాగే సహనంగా ఉండటం నేర్చుకున్నాను. విమర్శలు వచ్చినా వాటిని పాజిటివ్ యాంగిల్ లో ఆలోచిండం అలవడింది. అలాగే సీనియర్ నటుల నుండి యాక్టింగ్ సంబంధించి విలువైన విషయాలు నేర్చుకున్నాను.

 

దర్శకుడు విశ్వనాధ్ మాగంటి గురించి చెప్పండి ?
ఆయన చాలా సాఫ్ట్ పర్సన్. మొదటి చిత్రానికే ఇలాంటి ఫ్యామిలీ కథను ఎంచుకోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలను, కోపాలను, ద్వేషాలను ఆయన చక్కగా తెరకెక్కించారు. ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉండేలా ఆయన తెరకెక్కించిన తీరు బాగా నచ్చింది.

సంబంధిత సమాచారం :