నవరస ప్రమోషన్స్ షురూ…సాయంత్రం తూరిగా సాంగ్ విడుదల!

Published on Jul 12, 2021 11:02 am IST

తొమ్మిది ఎపిసొడ్ లతో వస్తున్న నవరస వెబ్ సిరీస్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నవరసాలను తొమ్మిది భాగాలుగా తెరకెక్కించడం జరిగింది. అయితే ఈ వెబ్ సిరీస్ ఆగస్ట్ 6 న ఆన్లైన్ ద్వారా విడుదల కానున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్ర యూనిట్ ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రమోషన్లను మొదలు పెట్టింది. అయితే మొదటగా ఈ వెబ్ సిరీస్ లో ప్రేమ రసం అయిన గిటార్ కంబి మేల్ నిండ్రు లో సూర్య మరియు ప్రయాగ రోస్ మార్టిన్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఎపిసొడ్ కి ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. అయితే ఇందులో నుండి తూరిగా అనే పాటను నేడు సాయంత్రం విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. అయితే మణిరత్నం క్రియేషన్స్ లో వస్తున్న ఈ వెబ్ సిరీస్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. థింక్ మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :