గుంటూరులో గ్లామర్‌ ఆరబోసిన హీరోయిన్స్ !

Published on Jul 10, 2019 7:54 pm IST

హీరో రామ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ హీరోయిన్లుగా రాబోతున్న యాక్షన్ ఎంటర్టైనెర్ ‘ఇస్మార్ట్ శంకర్’. కాగా వరంగల్‌ లో జరిగిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే ఈ రోజు సాయంత్రం గుంటూరులోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ‘ఇస్మార్ట్ ఈవెంట్’ జరిగింది. ఈ ఈవెంట్ కి కూడా విశేషమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా హీరోయిన్స్ నభా నటేష్, నిధి అగర్వాల్ ఇద్దరూ పోటీపడి మరీ చాలా గ్లామర్‌ గా కనిపిస్తూ.. వచ్చిన ప్రేక్షకులను బాగా అలంరించారు.

మొత్తానికి ఈ ఈవెంట్ సినిమా ప్రమోషన్ కి బాగా కలిసి వచ్చింది. ఇక ఈ చిత్రం జూలై 18న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఇక మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత సారథ్యంలో విడుద‌లైన పాట‌ల‌కు ఇప్పటికే అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమాలో రామ్‌ సరికొత్త లుక్‌ లో కనపింబోతున్నారు. రాజ్ తోట ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More