ఆర్ఆర్ఆర్ లో ఆ రెండు సన్నివేశాలు చాలా ప్రత్యేకమట..!

ఆర్ఆర్ఆర్ లో ఆ రెండు సన్నివేశాలు చాలా ప్రత్యేకమట..!

Published on Nov 28, 2019 9:38 AM IST

rrr

సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని మనసుకు హత్తుకునేలా, ప్రేక్షకుడు లీనం ఐయ్యేలా తీస్తారు దర్శకుడు రాజమౌళి. ఆయన విజయ రహస్యం కూడా అదే. ప్రతి సన్నివేశంలో ప్రేక్షకుడిని ఇన్ వాల్వ్ ఐయ్యేలా చేస్తూ, చివరివరకు తీసుకెళతాడు. దీని వలన మూవీ చూస్తున్నంత సేపు ఆడియన్స్ కి ఆహ్లదం కలుగుతుంది. మరి అలాంటి రాజమౌళి ఇద్దరు టాప్ స్టార్స్ తో చేస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉంటారు అనేది మనం ఊహించుకోవచ్చు. ఎన్టీఆర్, చరణ్ లు ఒకప్పటి ఉద్యమ వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ ఇద్దరు వీరులు రెండు భిన్న సంఘటనలలో యుక్త వయసులోనే ప్రాణాలు విడిచారు. కొమరం భీం నిజాం పాలనకు వ్యతిరేకంగా ఆయుధం పట్టగా, అల్లూరి బ్రిటిష్ దొరల దురాగతాలను ఎదిరిస్తూ యుద్ధభేరి మోగించారు. ఈ ఇద్దరు వీరులు తమ ప్రాణాలు కోల్పోయే సన్నివేశాలను ప్రత్యేకంగా చాలా శ్రద్ధతో తెరకెక్కించనున్నారట రాజమౌళి. ఈ సన్నివేశాలలో ఎన్టీఆర్, చరణ్ ల నటన వీరోచితంగా, బంధించబడిన సింహం గాండ్రిపులా ఉంటుందట. అదే సమయంలో ఉద్వేగంగా కంటతడి పెట్టించేలా ఈ ఇద్దరు వీరులు చతినిపోయే సన్నివేశాలు ఉంటాయని సమాచారం. ఇక ఆర్ ఆర్ ఆర్ వచ్చే ఏడాది జులై 30న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు