తనపై వస్తున్న పుకార్లపై స్పందించిన త్రిషా.

Published on Mar 26, 2020 11:00 pm IST

తెలుగులో అధిక కాలం స్టార్ హీరోయిన్ గా కొనసాగిన మోడరన్ హీరోయిన్స్ లో త్రిషా ఒకరు. ఆమె దశాబ్దానికి పైగా తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగింది. అందరూ టాప్ స్టార్స్ తో ఆడిపాడిన త్రిషాకి తెలుగులో ప్రస్తుతం ఆఫర్స్ లేవు. ఐతే ఇటీవల చిరు 152వ చిత్రం నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించి సంచలనం రేపింది. ఆమె తెలుగులో నటించాలని అనుకోవడం లేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో స్పందించారు.

ఆ పుకార్లకు సమాధానంగా “నేను హీరోయిన్ గా ఎదిగిందే తెలుగు సినిమాలతో. అలాంటప్పుడు తెలుగు సినిమాలు చేయనని ఎందుకంటాను. ఆ మధ్య తెలుగు నుంచి ఒక ఆఫర్ వస్తే, డేట్స్ కుదరక చేయలేనని చెప్పాను. అప్పటి నుండి ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. ఇదంతా పుకారు మాత్రమే” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మలయాళ మూవీస్ తో బిజీగా ఉన్నానని త్రిషా తెలిపారు.

సంబంధిత సమాచారం :

X
More