మహేష్,ఎన్టీఆర్,చరణ్ కలిస్తే ఫన్ ఓరేంజ్ లో..వైరల్ అవుతున్న త్రో బ్యాక్ పిక్

Published on Feb 23, 2020 2:44 pm IST

మిగతా పరిశ్రమలతో పోల్చుకుంటే టాలీవుడ్ హీరోల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. టాలీవుడ్ లో చాల మంది హీరోలు ఒకరితో మరొకరు చాలా అన్యోన్యంగా ఉంటారు. ఇక టాలీవుడ్ టాప్ హీరోలుగా కొనసాగుతున్న మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్ మంచి మిత్రులు. ఖాళీ సమయాలలో ఈ హీరోలు తమ కుటుంబాలతో కలిసి ప్రైవేట్ పార్టీలలో కూడా పాల్గొంటూ ఉంటారు. అలాగే మహేష్ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూ లో చరణ్, తారక్ లతో లాంగ్ రైడ్ కి వెళ్ళడానికి ఇష్టపడతాను ని చెప్పుకొచ్చారు.

వీరు ముగ్గురు కలిసి ఆహ్లాదంగా గడుపుతున్న పాత ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఎవరో జోక్ వేయగా ముగ్గురూ గట్టిగా నవ్వుతున్న ఆ ఫోటో ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొంటుండగా, మహేష్ ఇటీవలే అమెరికా ట్రిప్ ముగించుకొని వచ్చారు.

సంబంధిత సమాచారం :

X
More