నైజాం లో ఉస్తాద్ భగత్ సింగ్ బుకింగ్స్ షురూ.. టికెట్ ధరలు ఇవే..!

ustaad-bhagat-singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి సంబంధించి నైజాం రీజియన్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ షురూ అయ్యాయి. అయితే, ఈ సినిమా విషయంలో చిత్ర యూనిట్ ప్రేక్షకులకి ఒక తీపి కబురు అందించింది. భారీ బడ్జెట్ చిత్రాలకు సాధారణంగా ఉండే టికెట్ ధరల పెంపు ఈ సినిమాకు ఉండదు.

తెలంగాణలో సాధారణ ధరలకే ఈ సినిమాను ప్రదర్శించనుండటం విశేషం. ప్రస్తుత ధరల వివరాల ప్రకారం.. మల్టీప్లెక్స్‌లలో రూ.295 మరియు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.175 గా టికెట్ రేట్లను నిర్ణయించారు. టాలీవుడ్ లో ఒక భారీ హీరో సినిమా ఎలాంటి రేట్ల పెంపు లేకుండా విడుదలవ్వడం ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారి. మైత్రీ మూవీ మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల థియేటర్లకు సామాన్య ప్రేక్షకుల తాకిడి పెరగడమే కాకుండా, సినిమాకు భారీ ఆక్యుపెన్సీ లభించే అవకాశం ఉంది.

​హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రధాన థియేటర్లలో బుకింగ్స్ ప్రారంభం కాగా, ఉదయం 7:30 గంటల నుండే షోలు మొదలవుతాయని సమాచారం. అయితే ఉదయం 4 గంటల షోల గురించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మిగిలిన థియేటర్లలో కూడా త్వరలోనే బుకింగ్స్ అందుబాటులోకి రానున్నాయి.

Exit mobile version