సమీక్ష : “టైగర్ 3” – రొటీన్ ప్లేతో సాగే యాక్షన్ డ్రామా !

సమీక్ష : “టైగర్ 3” – రొటీన్ ప్లేతో సాగే యాక్షన్ డ్రామా !

Published on Nov 12, 2023 11:58 PM IST
Tiger 3 Movie Review in Telugu

విడుదల తేదీ : నవంబర్ 12, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, ఇమ్రాన్ హష్మీ, రేవతి, సిమ్రాన్, అనీష్ కురువిల్లా, రద్ధీ డోంగ్రా, మాస్టర్ విశాల్ జేత్వా, కుముద్ మిశ్రా, రణ్వీర్ షోరే తదితరులు

దర్శకుడు : ఆదిత్య చోప్రా

నిర్మాత: ఆదిత్య చోప్రా

సంగీతం: తనూజ్ టికు

సినిమాటోగ్రఫీ: అనయ్ గోస్వామి

ఎడిటర్: రామేశ్వర్ S. భగత్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భారతీయ గూఢచారిగా సల్మాన్ ఖాన్ నటించిన ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’ విజయాలు కారణంగా తాజాగా వచ్చిన ‘టైగర్ 3’ పై అంచనాలు బాగా పెరిగాయి. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

 

టైగర్ అలియాస్ అవినాష్ (సల్మాన్ ఖాన్) ఓ ‘రా’ ఏజెంట్. తన భార్య అయిన మాజీ ఐఎస్ఐ ఏజెంట్ జోయా (కత్రినా కైఫ్)తో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. అయితే, గోపి (రణ్వీర్ షోరే)ని తీవ్రవాదుల నుంచి కాపాడే క్రమంలో టైమ్ పాస్ మిషన్ స్టార్ట్ చేస్తాడు. ఐతే, మరణించే ముందు జోయా డబుల్ ఏజెంట్ అని గోపి చెబుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల కారణంగా జోయా, టైగర్ కలిసి టర్కీలోని పాకిస్తాన్ దేశానికి చెందిన ఓ సూట్ కేస్ ను దొంగిలిస్తారు. ఇంతకీ, ఆ సూట్ కేస్ లో ఏముంది ?, భారత్, పాకిస్తాన్ ప్రభుత్వాలు వీరిద్దరి కోసం ఎందుకు వేట మొదలు పెట్టాయి ?, అసలు వీరిద్దరిలో ఎవరు ఏ దేశానికి ద్రోహం చేశారు ?, ఈ మధ్యలో మాజీ ఐఎస్ఐ ఏజెంట్ అతిష్ రెహమాన్ (ఇమ్రాన్ హష్మీ) పాత్ర ఏమిటి ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాతో వచ్చిన ఈ ‘టైగర్ 3’ చిత్రం గ్రాండ్ యాక్షన్ అండ్ భారీ విజువల్స్ తో కొన్ని చోట్ల ఆకట్టుకుంది. సినిమాలో సల్మాన్ ఖాన్ యాక్షన్ ఎలివేషన్స్ తో పాటు కథలోని మెయిన్ పాయింట్ కూడా బాగుంది. అలాగే, టైగర్ పాత్రలోని షేడ్స్ ను, మరియు యాక్షన్ సీక్వెన్సెస్ ను దర్శకుడు బాగానే తీర్చిదిద్దారు. సల్మాన్ ఖాన్ వన్ మ్యాన్ షోతో నడిచిన ఈ సినిమాలో.. ఆయన తన పాత్రలో అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా తన యాక్షన్ బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్ స్ లో సల్మాన్ ఖాన్ నటన సినిమాకే హైలైట్ గా నిలిచింది.

అయితే, ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ మాత్రం షారుఖ్ ఖానే. ఈ సినిమాలో అతిథిగా కనిపించిన షారుఖ్ నిజంగా చాలా బాగా అలరించారు. ఇక హీరోయిన్ గా నటించిన కత్రినా కైఫ్ కూడా తన బోల్డ్ లుక్స్ తో అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. ముఖ్యంగా వైట్ టవల్ ఫైట్ సీక్వెన్స్ లో ఆమె గ్లామర్ యూత్ ను బాగా ఆకట్టుకుంది. విలన్ పాత్రలో నటించిన ఇమ్రాన్ హష్మీ కి పెద్దగా నటించే స్కోప్ లేదు. అయితే ఉన్నంతలో అతను బాగానే నటించాడు. ఇక మిగిలిన కీలక పాత్రల్లో నటించిన రేవతి, సిమ్రాన్, రద్ధీ డోంగ్రా బాగానే నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ ‘టైగర్ 3’ కథలో డెప్త్ లేదు. దీనికి తోడు కొన్ని సీన్స్ కన్ ఫ్యూజ్డ్ గా సాగాయి. పైగా మెయిన్ ప్లాట్ లోని మెయిన్ క్యారెక్టర్స్ మధ్య ప్రధాన కాన్ ఫ్లిక్ట్ ను ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేయాల్సింది. అలాగే, హీరో సల్మాన్ ఖాన్ పాత్రలోని ఎమోషన్ కూడా ఇన్ వాల్వ్ అయ్యేలా లేదు. అలాగే కొన్ని ఇన్సిడెంట్స్ మరీ సినిమాటిక్ గా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు కూడా అంతగా ఆకట్టుకోవు. పైగా ఇమ్రాన్ హష్మీ పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూ, అలాగే ఇమ్రాన్ హష్మీ మోటివ్ ను కూడా ఇంకా బాగా రాసుకుని ఉండాల్సింది.

దీనికితోడు, రచయిత ఆదిత్య చోప్రా సినిమాలో ఇంట్రెస్టింగ్ ప్లేను బిల్డ్ చేయలేకపోయారు. పైగా కొన్ని సీన్స్ లో నాటకీయత ఎక్కువవడంతో ఆ సీన్స్ లో సహజత్వం లోపించింది. అయితే, దర్శకుడు సెకండాఫ్ ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఇంట్రెస్ట్ గా నడుపుదామని మంచి ప్రయత్నం అయితే చేశారు గానీ, ఓవరాల్ కొన్ని చోట్ల లాజిక్స్ వదిలేశారు. ఓవరాల్ గా రొటీన్ గా సాగే ఈ బేసిక్ స్పై డ్రామా పెద్దగా మెప్పించదు.

 

సాంకేతిక విభాగం :

 

టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. తనూజ్ టికు నేపథ్య సంగీతం చాలా బాగుంది. అదే విధంగా అనయ్ గోస్వామి సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం చాలా బాగుంది. సినిమాలోని నిర్మాత ఆదిత్య చోప్రా పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కాకపోతే, ఆదిత్య చోప్రా తన రచనతో ఆకట్టుకోలేకపోయారు. ఉత్కంఠభరితమైన కథనాన్ని ఇంకా ఎఫెక్టివ్ రాసుకుని ఉండి ఉంటే సినిమా బాగుండేది.

 

తీర్పు :

 

హై వోల్టేజ్ యాక్షన్ అండ్ స్పై డ్రామాగా వచ్చిన ఈ ‘టైగర్ 3’ చిత్రం.. గ్రాండ్ యాక్షన్ విజువల్స్ తో పాటు షారుఖ్ ఎంట్రీ సీన్, మరియు సల్మాన్ ఖాన్ యాక్షన్ తో కొన్ని చోట్ల బాగానే ఆకట్టుకుంది. కాకపోతే, రొటీన్ కథతో పాటు బేసిక్ స్పై ప్లే వంటి అంశాలు ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ చిత్రం సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ తో పాటు యాక్షన్ లవర్స్ కి కూడా బాగానే కనెక్ట్ అవుతుంది. కానీ, మిగిలిన వర్గాల ప్రేక్షకులను మాత్రం కనెక్ట్ కాకపోవచ్చు.

 

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు