అక్కడ ప్రీ సేల్స్ తో “టిల్లు స్క్వేర్” దూకుడు!

అక్కడ ప్రీ సేల్స్ తో “టిల్లు స్క్వేర్” దూకుడు!

Published on Mar 27, 2024 3:00 PM IST

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ మల్లిక్ రామ్ దర్శకత్వం లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ టిల్లు స్క్వేర్ (Tillu square). మార్చి 29, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పై అందరిలో ఆసక్తి నెలకొంది. మార్చి 28 వ తేదీన యూఎస్ ప్రాంతం లో ప్రీమియర్ షో లు మొదలు కానున్నాయి. ఈ ప్రాంతం లో టిల్లు స్క్వేర్ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటి వరకూ 150 కే డాలర్లకు పైగా ప్రీ సేల్స్ తో వసూళ్లు రాబట్టింది. ప్రీమియర్స్ కి ఇంకా ఒక రోజు మిగిలి ఉండటం తో, ఈ వసూళ్లు పెరిగే అవకాశం ఉంది.

ఈ ప్రాంతం కి సంబందించిన థియేట్రికల్ రైట్స్ దాదాపు 1.3 మిలియన్ డాలర్ల వరకు అమ్ముడు అయినట్లు సమాచారం. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే, ఈ రేంజ్ వసూళ్లు సాధించడం సులభమే అని చెప్పాలి. అంతేకాక డీజే టిల్లు (DJ Tillu) చిత్రం కంటే డబుల్ బిజినెస్ జరిగినట్లు టాక్. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. బబ్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మించడం జరిగింది. ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు