ధనుష్ ‘కుబేర’ టీజర్ రిలీజ్ కి టైం ఖరారు!

ధనుష్ ‘కుబేర’ టీజర్ రిలీజ్ కి టైం ఖరారు!

Published on May 24, 2025 7:00 PM IST

కోలీవుడ్ వెర్సటైల్ హీరో ధనుష్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా మన టాలీవుడ్ మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే “కుబేర”. మరి కింగ్ నాగార్జున కూడా సాలిడ్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం నుంచి అవైటెడ్ టీజర్ ని విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ మే 25న డేట్ ని ఖరారు చేసిన మేకర్స్ ఇపుడు ఈ ట్రాన్స్ టీజర్ రిలీజ్ కి సమయాన్ని కూడా ఖరారు చేసేసారు. దీనితో కుబేర టీజర్ రేపు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి వస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. మరి ఈ టీజర్ లో దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన స్కోర్ బిగ్గెస్ట్ హైలైట్ గా నిలుస్తుంది అని తెలుస్తుంది. దీనితో ఈ టీజర్ చూడాలని ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు