“వకీల్ సాబ్” పవర్ ఫుల్ నెంబర్ కు టైం లాక్.!

Published on Mar 2, 2021 4:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లేటెస్ట్ సినిమా “వకీల్ సాబ్”. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. మరి అలాగే వచ్చే ఏప్రిల్ లోనే ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా మిగిలి ఉన్న ఒక్క “మార్చ్ నెలను మ్యూజికల్ మార్చ్ గా మార్చేస్తున్నామని” మేకర్స్ ప్రకటించారు.

దీనితో గత ఏడాది ఆగిన సాంగ్స్ పర్వం మళ్ళీ ఇప్పుడు మొదలయ్యినట్టు అయ్యింది. ఇక ఇదిలా ఉండగా గత కొన్ని రోజులు నుంచి టీజ్ చేస్తున్న వస్తున్న పవర్ ఫుల్ పవన్ మార్క్ సాంగ్ కోసం మేకర్స్ ఇప్పుడు క్లారిటీ ఇచ్చేసారు. ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్ “సత్యమేవ జయతే”ను మేకర్స్ ఈ మార్చ్ 3న సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు.

ఇక అలాగే ఈ పాటను ప్రముఖ సాహిత్య రచయిత రామజోగయ్య శాస్త్రి రాయగా థమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి ఈ సాంగ్ ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే రేపటి వరకు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రంలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా నివేతా థామస్ మరియు అంజలిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే దిల్ రాజు మరియు శిరీష్ ను నిర్మాణం వహించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఏప్రిల్ 9న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :