నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తన కెరీర్ 111వ సినిమా ఇప్పుడు దర్శకుడు గోపిచంద్ మలినేని కలయికలో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే మేకర్స్ ఈ సినిమా హీరోయిన్ ఎవరు అనేది రివీల్ చేయలేదు. ఇది వరకు వేరే సబ్జెక్ట్ అనుకున్నప్పుడు నయనతార అని కన్ఫర్మ్ చేశారు.
కానీ తర్వాత ఈమె బదులు కాజల్ అగర్వాల్ రేస్ లోకి వచ్చినట్టు కన్ఫర్మ్ అయినట్లు టాక్ వచ్చింది. అయితే దీనిపై అధికారిక ప్రకటనకి ఇప్పుడు మేకర్స్ టైం ఖరారు చేసారు. రేపు జూన్ 19 ఉదయం 11 గంటల 9 నిమిషాలకి రివీల్ చేస్తున్నట్టు ఖరారు చేసారు. సో బాలయ్య సరసన కనిపించే ఆ బ్యూటీ పై క్లారిటీ రానుంది. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే వృద్ది సినిమాస్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.


