టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న హార్రర్ థ్రిల్లర్ చిత్రం ‘కిష్కింధపురి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లీడ్ రోల్‌లో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో అందాల భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపు చేశాయి. అయితే, తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ టీజర్‌ను ఆగస్టు 15న సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. సాహు గారపాటి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 12న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.


