ఎన్టీఆర్ ‘అరవింద’ నుండి రెండో పాటకి రంగం సిద్ధం !

Published on Sep 18, 2018 1:02 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ ఇమేజీకి తగ్గట్లుగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పూర్తి యాక్షన్ చిత్రం ‘అరవింద సమేత’. కాగా తాజాగా ఈ చిత్రం నుండి ‘అనగనగా’ లిరికల్ వీడియో సాంగ్ విడుదల అయి, సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సాంగ్ ప్లే మొదలవ్వగానే, పూజా ఎన్టీఆర్ ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘టఫ్ గా కనిపిస్తారు గాని మాట వింటారు. పర్వాలేదు’ అనగానే లిరిక్స్ స్టార్ట్ అవుతాయి.

కాగా తాజాగా ఈ చిత్రం నుండి రెండవ సాంగ్ కూడా విడుదల అవ్వనుంది. రేపు సాయంత్రం 4.30 గంటలకు రెండవ సాంగ్ అయిన ‘పెన్విటీ’ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో.. అక్కడి వాతావరణంతో పాటు, ఆ ప్రాంతపు కట్టుబాట్లు, వ్యవహారపు అలవాట్లు.. ఇలా ఇవన్నీ ఈ సాంగ్ లో కొన్ని షాట్స్ రూపంలో చూపించనున్నారు. అందుకే ఈ పాట ఈ చిత్ర కథనంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చిత్రబృందం నమ్మకంగా చెబుతుంది.

ఇక ఒకప్పటి హీరో జగపతిబాబు విలన్ గా నటిస్తుండగా, నాగబాబు ఎన్టీఆర్ తండ్రి పాత్రలో కనిపిస్తున్నారు. జగపతిబాబు, నాగబాబు ఇద్దరు రెండు ఫ్యాక్షన్ గ్రూపులకు చెందిన నాయకుల పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో కూడా సెప్టెంబర్ 20న నేరుగా మార్కెట్లోకి విడుదల అవ్వనుంది. అయితే చిత్ర విడుదలకు ముందు, విడుదల కార్యక్రమం ఉంటుందని చిత్రబృందం తెలిపింది.

సంబంధిత సమాచారం :