మహేష్ కు దక్కిన మరో అరుదైన గౌరవం

Published on May 17, 2019 10:50 am IST

ప్రతిష్టాత్మక టైమ్స్ మ్యాగజైన్ ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా అత్యధిక “మోస్ట్ డిసైరబుల్ మెన్” లిస్ట్ ని విడుదల చేయడం జరుగుతుంది. యూత్ లో ఆయా హీరో లకు ఉన్న పాపులారిటీ ఆధారంగా ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. టైమ్స్ ఈ సంవత్సరం “మోస్ట్ డిసైరబుల్ ఫర్ ఎవర్” లిస్ట్ లో మహేష్ పేరును చేర్చడం జరిగింది. ఇప్పటివరకు సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్ మాత్రమే ఈ లిస్ట్ లో పేరు సంపాదించారు . సౌత్ నుండి ఈ ఘనత సాధించిన మొట్ట మొదటి స్టార్ మహేష్ కావడం మరో విశేషం.
ఇప్పటికే “మహర్షి” సక్సెస్ తో ఫుల్ ఖుషీలో ఉన్న మహేష్ ఫ్యాన్స్ లో ఈ వార్త ఇంకొంత జోష్ నింపడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మహర్షి మూవీ ప్రొమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్న మహేష్, తన తదుపరి మూవీ అనిల్ రావిపూడి తో చేయనున్నాడు.

సంబంధిత సమాచారం :

More