‘ఆర్ సీ 12’ కు ఆ టైటిల్ ఖాయమైనట్లే ?

Published on Oct 19, 2018 4:02 pm IST


రామ్ చరణ్ నటిస్తున్న 12వ చిత్రం యొక్క టైటిల్ ఫై గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియా లో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈచిత్రానికి ‘స్టేట్ రౌడీ , వినయ విధేయ రామ’ అనే టైటిల్స్ ప్రచారంలోవున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా చిత్ర వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రానికి ‘వినయ విధేయ రామ’ అనే క్లాస్ టైటిల్ ను ఖరారు చేశారట. త్వరలోనే ఈ టైటిల్ ను అధికారికంగా ప్రకటించనున్నారు.

బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. ఇక ఈ చిత్రం యొక్క షూటింగ్ 80శాతం కంప్లీట్ అయ్యింది. హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దానయ్య డీవీవీ నిర్మిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :