నితిన్ కొత్త సినిమా టైటిల్ ఇదే

Published on Feb 19, 2020 11:15 pm IST

హీరో నితిన్ గ్యాప్ లేకుండా సినిమాలకు కమిటయ్యారు. ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో ఆయన చేసిన ‘భీష్మ’ చిత్రం అన్ని పనుల్ని పూర్తిచేసుకుని ఈ నెల 21న విడుదలకానుంది. దీని తర్వాత వెంకీ అట్లూరి డైరెక్షన్లో ‘రంగ్ దే’ అనే చిత్రాన్ని స్టార్ట్ చేయనున్నారు. ఇది కూడా లవ్ స్టోరీనే. దీని తర్వాత చంద్రశేఖర్ ఏలేటి డైరెక్షన్లో ఒక చిత్రం చేయనున్నారు.

కొన్ని నెలల కృతమే ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ చిత్రానికి ‘చెక్’ అనే టైటిల్ నిర్ణయించారట. త్వరలోనే దీన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన కథానాయిక కాగా ప్రియా ప్రకాష వారియర్ మరొక కథానాయికగా నటించనుంది. ఇది జైలు నేపథ్యంలో నడిచే కథని, ఇందులో నితిన్ ఖైదీగా కనిపిస్తారని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :