వినాయక చవితి సందర్భంగా నందమూరి హీరో సినిమా టైటిల్ ఎనౌన్స్ !

Published on Aug 19, 2018 10:33 am IST

‘మహానటుడు ఎన్టీఆర్’ మనవడిగా తన సినీ కెరీర్ ను మొదలు పెట్టిన నందమూరి కళ్యాణ్ రామ్ హిట్స్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. తాజాగా ప్రముఖ సినిమాటోగ్రఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో కళ్యాణ్ ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ లుక్ చాలా స్టైలిష్ గా ఉంటుందని తెలుస్తోంది.

కాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం టైటిల్ ను సెప్టెంబర్ 13 న వినాయక చవితి పండుగ సందర్భంగా ఎనౌన్స్ చేయనున్నారు. ఇప్పటికే చిత్రంలోని ప్రధాన భాగం షూట్ పూర్తయింది. కళ్యాణ్ రామ్ సరసన నివేతా థామస్ మరియు శాలిని పాండే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఈ సినిమాని నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం :

X
More