మెగాహీరో సినిమాకి ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు !
Published on Mar 12, 2018 12:45 am IST


యంగ్ మెగాహీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం యొక్క రెండు షెడ్యూళ్లు పూర్తికాగా తాజా షెడ్యూల్ హైదరాబాద్లో జరుగుతోంది. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి ‘దేవుడు వరమందిస్తే’ అనే టైటిల్ ను ఖారారు చేసినట్లు నిన్న వార్తలు వచ్చాయి.

కానీ ప్రస్తుతం సమాచారం మేరకు అలాంటిదేం లేదని, ఇంకా టైటిల్ నిర్ణయింపబడలేదని తెలుస్తోంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై కె.ఎస్.రామారావ్ నిర్మిస్తుండగా గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. వరుస పరాజయాల్లో ఉన్న తేజ్ ఈ సినిమాపైనే బోలెడు ఆశలుపెట్టుకున్నాడు. కరుణాకరన్ గతంలో పవన్ తో ‘తొలిప్రేమ’లాంటి క్లాసిక్ తీసి ఉండటంతో అభిమానుల్లో కూడ అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

 
Like us on Facebook