నేటి మ్యాచ్ లో ఈ దుస్థితికి కోహ్లీ భార్యే కారణమట…!

Published on Jul 10, 2019 8:31 pm IST

ఇండియా న్యూజిలాండ్ జట్ల మధ్య నిన్న జరగాల్సిన వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ నేడు ప్రారంభమైంది. 239పరుగులకే కివీస్ ని కట్టడి చేసిన భారత్ టీం 240 లక్ష్య ఛేదనకు బరిలోకి దిగి ఆదిలోనే కీలకమైన నాలుగు వికెట్లు చేజార్చుకొని కష్టాల్లోపడింది.

ఐతే ఈ పరిస్థితికి అసలు కారణం ఆటగాళ్లు సరిగా ఆడకపోవడం కాదట, ఖోహ్లి సతీమణి అనుష్క శర్మ ఆ మ్యాచ్ కి హాజరుకావడం వల్లనే అంట. బాలీవుడ్ వివాదాస్పద క్రిటిక్ అయిన కమల్ ఆర్ ఖాన్ అనుష్కపై ఈ రీతిలో స్పందించాడు. అంతే కాదు గత వరల్డ్ కప్ ఫైనల్ లో కూడా ఇండియా ఓటమి చెందడానికి కారణం అప్పుడు ఆ మ్యాచ్ కు కూడా అనుష్క రావడం వలనే అంటూ ట్వీట్ చేశారు. ఉరుము ఉరిమి మంగళం మీదపడ్డట్టు, ఆటగాళ్లు ఆడకపోతే అనుష్క ఏమిచేస్తుంది చెప్పండి.

సంబంధిత సమాచారం :

More