తెలంగాణా సూర్యకాంతం జయంతి నేడు.

Published on Jun 9, 2019 10:12 am IST

తెలుగు తెరపై తెలంగాణా శకుంతలది ప్రత్యేక శైలి. తెలంగాణా మాండలికంలో ఆమె డైలాగులు, కళ్లలో కోపం,మాటలతో కరుకుతనం ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. నాటి సూర్యకాంతం తరువాత అలాంటి గయ్యాళి పాత్రలకు శకుంతల కేర్ అఫ్ అడ్రస్ గా మారారు. ప్రతినాయకి పాత్రలే కాకుండా, కామెడీ, అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా రాణించారు. తెలంగాణా శకుంతల జయంతి నేడు. మహారాష్ట్రియన్ ఫ్యామిలీకి చెందిన శకుంతల 9 జూన్ 1951లో జన్మించారు.

స్టేజ్ ఆర్టిస్ట్ గా నట ప్రస్థానం మొదలుపెట్టిన శకుంతల 1979 లో వచ్చిన ‘మా భూమి’ సినిమా తో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఒసేయ్ రాములమ్మ, నువ్వు నేను,ఒక్కడు, లక్ష్మి వంటి చిత్రాలు ఆమెకు కీర్తిని తెచ్చిపెట్టాయి. ఆమె కెరీర్ మంచి దశలో ఉన్నప్పుడే 2014 జూన్ 14 న గుండె పోటుతో హఠాన్మరణం చెందారు.

సంబంధిత సమాచారం :

More