వర్మ మార్షల్ ఆర్ట్స్ మూవీ చైనాలో గ్రాండ్ రిలీజ్

Published on Dec 13, 2019 7:37 pm IST

రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్సీ మూవీస్ చేస్తూనే మధ్య మధ్యలో కంటెంట్ ఉన్న చిత్రాలు కుండా చేస్తూ ఉంటారు. అలాంటిదే ఆయన చేసిన తాజా చిత్రం ఎంటర్ ది గర్ల్ డ్రాగన్. ఇండో చైనా నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన ఈ చిత్ర చైనీస్ వర్షన్ నేడు చైనాలోని ఫోషాన్ సిటీ నందు విడుదల చేస్తున్నారు. గాడ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అయిన బ్రూస్ లీ పుట్టిన ప్రాంతం కావడంతో ఈ చిత్రాన్ని అక్కడ మొదట విడుదల చేస్తున్నారు. ఇప్పటికే చైనా చేరుకున్న వర్మ ఆ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నాడట. ఈ విషయాన్నీ స్వయంగా వర్మ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

ప్రేమ-మార్షల్ ఆర్ట్స్- ఓ అమ్మాయి మధ్య ట్రయాంగిల్ స్టోరీగా ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ మూవీ ఉంటుందని వర్మ చెప్పడం జరిగింది. బ్రూస్ లీ ని పిచ్చిగా అభిమానించే అమ్మాయి ఆయన స్పూర్తితో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటుంది. ప్రేమించిన అబ్బాయికి మార్షల్ ఆర్ట్స్ అంటే ఇష్టం లేని కారణంగా ఆ అమ్మాయి ప్రేమా లేక ప్యాషనా అనే సందిగ్ధంలో పడుతుంది. ఈ చిత్రంలో మార్షల్ ఆర్ట్స్ గర్ల్ గా పూజా భాలేకర్ నటించారు. త్వరలో ఇండియాలో పలు భాషలలో విడుదల కానున్న ఈ చిత్రం చైనా లో ఎంత వరకు విజయం సాధిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More