థగ్స్ అఫ్ హిందుస్థాన్ కు అక్కడ కూడా చుక్కెదురు !

Published on Dec 29, 2018 10:53 am IST


బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన పిరియాడికల్ మూవీ థగ్స్ అఫ్ హిందుస్థాన్ గత నెల 8న విడుదలై నెగిటివ్ టాక్ తో ప్లాప్ సినిమాల జాబితాలో చేరిపోయింది. భారీ అంచనాలతో ఈ ఏడాది మచ్ అవైటెడ్ మూవీ గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫిస్ వద్ద దారుణంగా నిరాశపరించింది. కత్రినా కైఫ్ , అమితాబ్ బచ్చన్ , ఫాతిమా సన షేక్ వంటి స్టార్ కాస్ట్ కూడా సినిమాను కాపాడలేకపోయారు.

ఇక ఈచిత్రం నిన్న చైనా లో భారీ స్థాయిలో విడుదలై కేవలం 10 కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టగలిగింది. ఇంతకుముందు అమీర్ నటించిన ‘దంగల్ , సీక్రెట్ సూపర్ స్టార్’ అక్కడ రికార్డు స్థాయిలో వసూళ్లను కొల్లగొట్టాయి. అయితే ఈ సినిమా ఫుల్ రన్ లో వాటిలో సగం కూడా రాబట్టడం కష్టమే అనిపిస్తుంది.

విజయ్ కృష్ణ ఆచార్య తెరకెక్కించిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించింది.

సంబంధిత సమాచారం :