తుఫాన్ భాదితులకు విరాళం అందజేసిన కాజల్, రకుల్ ప్రీత్, రాశి ఖన్నా.

తుఫాన్ భాదితులకు విరాళం అందజేసిన కాజల్, రకుల్ ప్రీత్, రాశి ఖన్నా.

Published on Oct 15, 2014 3:13 PM IST

kajal-rakul
తెలుగు హీరోలతో పాటు మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు హీరోయిన్లు. హుధూద్ తుఫాన్ భాదితుల సహార్ధం ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 5 లక్షల విరాళం అందజేసింది. ఆమెతో పాటు ‘లౌక్యం’ ఫేం రకుల్ ప్రీత్ సింగ్, ‘ఊహలు గుసగుసలాడే’ ఫేం రాశి ఖన్నా చెరో లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు.

కథా రచయిత చిన్ని కృష్ణ 1.5 లక్షలు, గోపీచంద్ మలినేని 1 లక్ష, నిర్మాత సాయి కొర్రపాటి 100 టన్నుల బియ్యం అందజేశారు. ఇప్పటికే అగ్ర హీరోలు & నిర్మాతలు సహాయం అందించారు. విపత్కర పరిస్థితులలో తెలుగు చిత్ర పరిశ్రమ స్పందించిన తీరు హర్షణీయం. మరికొందరు ప్రముఖులు కూడా సహాయం చేయడానికి ముందుకొస్తున్నారు. హీరోల పిలుపుతో అభిమానులు సహాయక చర్యలలో పాల్గొనడానికి పయనమయ్యారు.

తాజా వార్తలు