ఆ రెండు మూవీల టీజర్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్.

Published on Jun 13, 2019 9:37 am IST

తెలుగు మూవీ లవర్స్ కి ఇవాళ పండగ రోజే అని చెప్పాలి. ఎందుకంటే టాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు స్టార్ హీరోల సినిమాలకు సంబందించిన టీజర్లు నేడు విడుదల కానున్నాయి. మూవీ టీజర్స్ పై ప్రేక్షకులకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, దానికి కారణం సినిమా ఎలా ఉండబోతుంది అనే ఒక అవగాహన టీజర్ చూస్తే మనకు అర్థం అవుతుంది. అలాగే మన అభిమాన హీరో ఎలా ఉండబోతున్నారు అనే సస్పెన్సు కి తెరపడుతుంది. అందుకే స్టార్ హీరో సినిమా టీజర్ కానీ ట్రైలర్ కానీ విడుదలవుతుందంటే వారి అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తూ ఉంటారు.

ఈ రోజు రెబెల్ స్టార్ ప్రభాస్ “సాహో” తోపాటు కింగ్ నాగార్జున నటిస్తున్న “మన్మధుడు 2” టీజర్ లు విడుదల కానున్నాయి. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న “సాహో” పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. యూవీ క్రియేషన్స్ ఎక్కడా రాజీ పడకుండా 350 కోట్ల పైగా బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు ప్రభాస్ లుక్,మేకింగ్ వీడియోస్ తో అంచనాలు అమాంతంగా పెరిగిపోవడంతో ప్రేక్షకులు, ముఖ్యంగా డార్లింగ్ అభిమానులు వేయికళ్లతో టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు.

ఇక యువసామ్రాట్ నాగార్జున, రకుల్ ప్రీత్, కీర్తి సురేష్ జంటగా రాహుల్ రవీంద్ర తెరకెక్కిస్తున్న ‘మన్మధుడు 2’ పై కూడా ప్రేక్షకులలో అంచనాలు బాగా ఉన్నాయి. ఇది గతంలో వచ్చిన హిట్ మూవీ ‘మన్మధుడు’ కి కొనసాగిపుకావడంతో ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కోసం నాగ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అలా నేడు టాలీవుడ్ ప్రేక్షకులు రెండు టాప్ హీరోల మూవీల టీజర్లు చూసి ఆనందించనున్నారు.

సంబంధిత సమాచారం :

More