నవంబర్ 30వ తారిఖు నాడు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సెలవు ప్రకటించారు. విశాఖ హుధూద్ తుఫాన్ భాదితులను ఆదుకోవడానికి టాలీవుడ్ నిర్వహిస్తున్న ఫండ్ రైజింగ్ ఈవెంట్ ‘మేము సైతం’ – వుయ్ లవ్ వైజాగ్’ ను ఆ రోజు నిర్వహించాలని పరిశ్రమ పెద్దలు నిర్ణయించారు. 24 క్రాఫ్ట్స్ టెక్నీషియన్లకు ఆ రోజు సెలవు. అందరూ ‘మేము సైతం’ – వుయ్ లవ్ వైజాగ్’ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు.
ఈ స్టార్ నైట్ కార్యక్రమంలో టాలీవుడ్ అగ్ర హీరోలు లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నారు. తెలుగు పరిశ్రమ ప్రముఖులతో పాటు ఈ కార్యక్రమానికి తమిళ పరిశ్రమ నుండి సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్, సూర్య, కార్తి, విక్రమ్ తదితరులు హాజరవుతున్నారు. తుఫాన్ భాదితులను ఆదుకోవడానికి ఇప్పటికే ఇరు పరిశ్రమలకు చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు. చిన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు సైతం తమకు చేతనైన సహాయం చేశారు.


