స్టార్ హీరోల జాబితాలో సేతుపతి

Published on Jan 15, 2021 12:56 am IST


విజయ్ సేతుపతి.. నటుడిగా తనని తాను అనేకసార్లు ప్రూవ్ చేసుకున్నాడు. హీరో అనే ట్యాగ్ కంటే నటుడు అనే పైపునే ఇష్టంగా ఆస్వాదిస్తుంటాడు. అందుకే కథ, పాత్ర నచ్చితే చిన్న పెద్ద అనే తేడా చూడకుండా ఓకే చెప్పేస్తుంటాడు. తాజాగా విడుదలైన ‘మాస్టర్’ సినిమాతో ప్రతినాయకుడి అవతారం ఎత్తాడు సేతుపతి. సినిమాలో సేతు పాత్రలో ఆయన కనబరచిన నటన అందరినీ అమితంగా ఆకట్టుకుంది. విజయ్ తర్వాత సిమిమాలో బాగా హైలెట్ అయిన అంశం సేతుపతి నటనే.

ప్రతినాయకుడి పాత్రలో అయినా సరే గొప్పగా నటించగలనని నిరూపించుకున్నాడు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చూసిన ప్రేక్షకులకు ఇకపై స్టార్ హీరోలకు ధీటైన విలన్ దొరికాడని అంటున్నారు. తెలుగు ప్రేక్షకులైతే మరీ మరీ పొగిడేస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల్లో కూడ విలన్ పాత్రలో సేతుపతి నటన గురించే చర్చ నడుస్తోంది. చూడబోతే ఇకమీదట తెలుగులో స్టార్ హీరోల సినిమాలకు విజయ్ సేతుపతి మంచి అశం అయ్యేలా కనిపిస్తున్నాడు. అసలే టాలీవుడ్లో విలన్ల కొరత ఎక్కువగా ఉంది. ఒకే నటుడ్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయలేక, కొత్తవారు దొరక్క హిందీ పరిశ్రమ వైపుకు పోతున్నారు మన వాళ్ళు. ఈ లోటును విజయ్ సేతుపతి భర్తీ చేయగలరని అనుకుంటున్నారు చాలామంది. ఇక ఆయన తెలుగులో పూర్తిస్థాయి నెగెటివ్ రోల్ చేసిన ‘ఉప్పెన’ త్వరలోనే విడుదలకానుంది. ఈ సినిమా తర్వాత ఆయనకు మరిన్ని ఆఫర్లు రావొచ్చు.

సంబంధిత సమాచారం :