తమిళనాట పట్టు సాధిస్తున్న తెలుగు హీరోలు

తమిళనాట పట్టు సాధిస్తున్న తెలుగు హీరోలు

Published on Dec 2, 2011 12:45 PM IST

మహేష్ బాబు నటిస్తున్న బిజినెస్ మ్యాన్ సినిమా మూడు భాషల్లో రాబోతున్నాడు. రానా వెట్రిమారన్ డైరెక్షన్లో చేయనున్న సినిమా తెలుగు, తమిళ రూపొందనుంది. అల్లరి నరేష్ నటించిన ‘పోరాలి’ (తెలుగులో సంఘర్షణ) సినిమాతో తమిళనాట అడుగుపెట్టారు. ఇన్ని రోజులు మన తెలుగు హీరోలకి తమిళనాట సరైన మార్కెట్ ఉండేది కాదు అన్న అపవాదు ఉండేది. త్వరలో అది తోలిగిపోనుంది. ఇది మంచి డెవెలప్మెంట్.

తమిళ హీరోలు రజినీకాంత్, కమల్ హసన్, సూర్య, కార్తి మరియు విక్రమ్ కి తెలుగులో మంచి ఆదరణ ఉంది. ఈ తరం నటులు మహేష్, నరేష్, రానా ఆల్రెడీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. వీరే కాకుండా అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ కూడా ప్రయత్నిస్తున్నారు. మహేష్, చరణ్, రానా చెన్నైలో చదువుకోవడం, తమిళ భాష మీద మంచి పట్టు ఉండటం వారికి ప్లస్ అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు