ఆగష్టు 1 నుండి టాలీవుడ్ మూవీ షూటింగ్స్ నిలిపివేత …. !

Published on Jul 26, 2022 11:00 pm IST

గత కొద్దిరోజులుగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో నెలకొన్న కొన్ని సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ పలుమార్లు సమావేశాలు నిర్వహించింది. ముఖ్యంగా ఓటిటి మాధ్యమాల్లో సినిమా విడుదల, సినిమా వ్యయం, సినిమా టికెట్ ధరలు ఇలా పలు సమస్యలపై పూర్తి క్లారిటీ రావాలని వారు అంటున్నారు. ఇక నేడు మరొకసారి జరిగిన సమావేశంలో భాగంగా ఆగష్టు 1 నుండి పూర్తిగా టాలీవుడ్ సినిమాల షూటింగ్స్ అన్ని నిలిపి వేయడానికి నిర్ణయించినట్లు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రకటించింది. కొద్దిసేపటి క్రితం దీనికి సంబంధించి వారు అఫీషియల్ గా ఒక ప్రకటన విడుదల చేసారు.

కాగా సమస్యలన్నిటి గురించి పక్కాగా చర్చించేందుకు నిర్మాతలందరూ తరలి రావాల్సిందే అని, ప్రతి ఏడాది వాహనాలు, కర్మాగారాలు ఏ విధంగా సర్వీసింగ్ చేస్తారో అలానే టాలీవుడ్ పరిశ్రమలో కూడా సమస్యల పరిష్కారం జరగాలని వారు అంటున్నారు. దీనితో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న మూడు సినిమాలు, బాలయ్య 107వ సినిమా, అఖిల్ ఏజెంట్, నాని దసరా, విజయ్ దేవరకొండ ఖుషి, రవితేజ రావణాసుర, రామ్ చరణ్ శంకర్ మూవీ వంటి బడా మూవీస్ తో పాటు పలు ఇతర సినిమాలు కూడా నిలిచిపోనున్నాయి. పూర్తిగా సమస్యల పరిష్కారం తరువాతనే మళ్ళి షూటింగ్స్ పునరుద్ధరిస్తాం అని ప్రొడ్యూసర్స్ గిల్డ్ వారు తమ నోట్ లో తెలిపారు.

సంబంధిత సమాచారం :