జాతీయ స్థాయిలో తెలుగు చిత్రాలకు అవార్డుల పంట.

జాతీయ స్థాయిలో తెలుగు చిత్రాలకు అవార్డుల పంట.

Published on Aug 9, 2019 5:11 PM IST

జాతీయ స్థాయిలో తెలుగు సినిమాలకు అవార్డు పంట పండింది. ఏకంగా 7 జాతీయ అవార్డులు అందుకొని,తెలుగు సినిమా సత్తా చాటింది. నేడు ఢిల్లీ వేదికగా దేశవ్యాప్తంగా అన్ని చిత్ర పరిశ్రమల నుండి నామినేట్ కాబడిన చిత్రాలలో అవార్డులను గెలుచుకున్న చిత్రాలను ప్రకటించగా, తెలుగు పరిశ్రమ నుండి మొత్తం నాలుగు చిత్రాలు ఏడు క్యాటగిరీలలో అవార్డులను సొంతం చేసుకున్నాయి.

మహానటి సావిత్రి జీవిత కధ ఆధారంగా తెరకెక్కిన “మహానటి” చిత్రం ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి(కీర్తి సురేష్), ఉత్తమ కాస్ట్యూమ్ విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది. అలాగే దర్శకుడు సుకుమార్,రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “రంగస్థలం” మూవీ బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగంలో అవార్డు పొందింది. ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ప్రయోగాత్మ చిత్రం “అ”, బెస్ట్ మేకప్, బెస్ట్ వి ఎఫ్ ఎక్స్ విభాగాలలో అవార్డులు గెలుపొందగా, దర్శకుడు రాహుల్ రవీంద్ర డైరెక్షన్ లో సుశాంత్ హీరోగా తెరకెక్కించిన “చిలసౌ” మూవీ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో అవార్డు పొందడం జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు