విషాదం : టాలీవుడ్ సీనియర్ దర్శకుడు కన్నుమూత.!

Published on Feb 2, 2023 9:56 am IST

మన టాలీవుడ్ గడిచిన కొన్ని నెలల లోనే పలు వరుస విషాదాలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. ఓ వార్త మర్చిపోయే లోపే మరొక వార్త బయటకి వస్తుంది. కొన్ని రోజులు కితమే సీనియర్ వెర్సటైల్ నటి జమున గారు కాలం చేయగా ఇప్పుడు ఓ సీనియర్ దర్శకుడు కన్ను మూసినట్టుగా విషాద వార్త బయటికి వచ్చింది.

మరి ఆ దర్శకుడు విద్యా సాగర్ రెడ్డి కాగా తాను ఈరోజు తెల్లవారు జామున ఉదయం 5 గంటల 20 నిమిషాల సమయంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో తన 70వ ఏట తుది శ్వాస విడిచారు. మరి ఆయన 1952 లో గుంటూరులో జన్మించగా రాకాసి లోయ సినిమాతో దర్శకునిగా కెరీర్ ప్రారంభించారు. స్టూవర్టుపురం దొంగలు, ఖైదీ బ్రదర్స్, అమ్మదొంగ, అన్వేషణ తదితర పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు.

అంతే కాకుండా తాను 3 నంది అవార్డులు కూడా గెలుపొందడమే కాకుండా తెలుగు సినిమా దర్శకుల సంఘానికి మూడు సార్లు అధ్యక్షునిగా తాను పని చేశారు. మరి ఇప్పుడు వీరి అకాల మరణం పట్ల అయితే చిత్ర పరిశ్రమ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. అలాగే మా 123తెలుగు యూనిట్ వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తుంది.

సంబంధిత సమాచారం :