కమిట్‌మెంట్ అడిగిన హీరోకు ఖుష్బూ ఏమని ఆన్సర్ ఇచ్చిందంటే?

Published on Jul 8, 2021 4:00 am IST


తమిళంలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుని, అక్కడ అభిమానులతో గుడి కట్టించుకున్న హీరోయిన్ ఖుష్బూకు హీరోయిన్‌గా తొలి అడుగు మాత్రం తెలుగు సినిమాతోనే పడింది. 1986లో విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా నటించిన తొలి సినిమా క‌లియుగ పాండ‌వులుతో ఖుష్బూ హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత రాజేంద్రప్రసాద్, చిరంజీవి, వెంక‌టేష్‌, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన కూడా నటించింది. అయితే తెలుగులో ఖుష్బూ చేసింది తక్కువ సినిమాలే అయినా ఇక్కడ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇదిలా ఉంటే తెలుగులో ఓ ప్రముఖ హీరోతో నటిస్తున్నపుడు అతడు కమిట్‌మెంట్ అడిగాడని ఖుష్బూ ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే సదరు హీరో చెల్లెలిని తన తమ్ముడి గదిలోకి పంపిస్తే తాను కమిట్‌మెంట్ ఇస్తానని చెంప చెల్లుమనిపించే ఆన్సర్ ఇచ్చినట్టు ఖుష్బూ చెప్పింది. దీంతో అప్పటి నుంచి స‌ద‌రు సీనియ‌ర్ హీరోకు తనకు మాట‌లు లేవని చెప్పుకొచ్చింది. అయితే తెలుగులో ఖుష్బూ చాలా తక్కువ మంది హీరోలతోనే నటించింది. మరి వాళ్లలో ఎవరు కమిట్‌మెంట్ అడిగి ఉంటారో అనేది మాత్రం దేవుడికే.. కాదు కాదు ఖుష్బూకి, ఆ హీరోకి మాత్రమే తెలియాలి.

సంబంధిత సమాచారం :