ఆ స్టార్ హీరోలిద్దరూ మల్టీ స్టారర్స్ వైపే ఇంట్రస్ట్ చూపిస్తున్నారు !

Published on Jul 24, 2018 8:21 pm IST


తెలుగు అగ్ర హీరోలు అనగానే గుర్తొచ్చే ఆ నాలుగు పేర్లలో నాగార్జున, వెంకటేష్ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తాయి. దాదాపు మూడు దశాబ్దాలు పాటు స్టార్ హీరోలుగా తమ కెరీర్ ను కొనసాగించిన ఈ హీరోలు ఇప్పుడు ఉన్నట్టు ఉండి తమ రూటును మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు మల్టీస్టారర్స్ వైపే మొగ్గు చూపుతున్నారు. సోలో హీరోగా సినిమాలను తగ్గిస్తూ కాంబినేషన్స్ నే ఎక్కువుగా నమ్ముతున్నారు. ఇప్పటికే వెంకటేష్ బాబీ దర్శకత్వంలోనాగ చైతన్యతో కలిసి ‘వెంకీ మామ’ అనే మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే వరుణ్ తేజ్ తో కలిసి ‘ఎఫ్ 2’ చిత్రంలో నటిస్తున్నారు.

ఇక నాగార్జున కూడా నానితో కలిసి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ మల్టీ స్టారర్ లో నటిస్తున్నాడు. అలగే కరణ్‌ జోహార్‌ నిర్మాణంలో రూపొందుతున్న ‘బ్రహ్మస్త్ర’ చిత్రంలో అమితాబ్‌, రణ్‌బీర్‌ కపూర్‌ లతో కలిసి అక్కినేని నాగార్జున కూడా ఓ కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం నందమూరి కళ్యాణ్ రామ్ తో పవన్ సాతినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో కూడ నాగ్ నటించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాలు పూర్తయ్యేలోపు ఈ సీనియర్ హీరోలిద్దరూ మరికొన్ని చిత్రాల్లో కొత్త కాంబినేషన్ లో నటించే అవకాశం ఉంది. ఏదైమైనా ఇప్పుడు ఈ స్టార్ హీరోల మల్టీ స్టారర్స్ వైపే ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.

సంబంధిత సమాచారం :