పవన్ తో టాలీవుడ్ నిర్మాతల కీలక భేటీ!

Published on Oct 1, 2021 2:11 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, దానయ్య, నవీన్ ఎర్నేని, వంశీ రెడ్డి, సునీల్ నారంగ్, బన్నీ వాసు లు ఈరోజు ఉదయం ఆయన నివాసం లో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ మేరకు సినీ పరిశ్రమ కి సంబంధించిన పలు సమస్యల గురించి సహృద్భావ వాతావరణం లో చర్చలు జరిగాయి. ఇందుకు సంబంధించిన విషయం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలివుడ్ గా మారింది.

పవన్ కళ్యాణ్ రీసెంట్ గా రిపబ్లిక్ ప్రీ రిలీజ్ వేడుక లో పాల్గొన్న సంగతి అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ వేడుక లో చేసిన వ్యాఖ్యలు రాజకీయం గా పెద్ద దుమారం రేపాయి. పవన్ కళ్యాణ్ రాజకీయం గా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం, రాష్ట్ర ప్రభుత్వం సినీ పరిశ్రమ కి సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా ఉంది.

సంబంధిత సమాచారం :