వైరల్ పిక్ : మాస్ రగ్డ్ లుక్ లో ఉస్తాద్ రామ్

వైరల్ పిక్ : మాస్ రగ్డ్ లుక్ లో ఉస్తాద్ రామ్

Published on Dec 9, 2022 2:30 AM IST


టాలీవుడ్ లో ప్రస్తుతం ఉస్తాద్ గా ఒక్కో సినిమాతో మంచి సక్సెస్ లు అందుకుంటూ ఆడియన్స్ నుండి బాగా క్రేజ్ తో దూసుకెళ్తున్నారు యంగ్ హీరో రామ్ పోతినేని. ఇటీవల లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన వారియర్ మూవీతో ఆడియన్స్ ముందుకి వచ్చిన రామ్, ప్రస్తుతం మాస్ యాక్షన్ మూవీస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో భారీ పాన్ ఇండియన్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

అయితే విషయం ఏమిటంటే, నేడు ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ సీఎంఆర్ షాపింగ్ మాల్ వారి నూతన బ్రాంచ్ ని విజయవాడలో ప్రారంభించగా దాని ఓపెనింగ్ ప్రత్యేకంగా విచ్చేసారు రామ్. ఈ సందర్భంగా ఎందరో ప్రేక్షకాభిమానులు హీరో రామ్ ని చూసేందుకు తరలివచ్చారు. అయితే ఈ ఓపెనింగ్ కి ఫుల్ గడ్డం, స్టైలిష్ కాస్ట్యూమ్స్, అదిరిపోయే గాగుల్స్ తో దర్శనమించిన రామ్, తన లేటెస్ట్ లుక్స్ తో అందరినీ ఆకట్టుకున్నారు. కాగా రామ్ లేటెస్ట్ లుక్ తాలూకు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు