భారీ చిత్రాలకు కేర్ అఫ్ అడ్రెస్ గా మారిన టాలీవుడ్

భారీ చిత్రాలకు కేర్ అఫ్ అడ్రెస్ గా మారిన టాలీవుడ్

Published on Jul 9, 2019 6:58 AM IST

ఒకప్పుడు టాలీవుడ్ చిత్రాలకు సౌత్ ఇండియా లోనే సరైన మార్కెట్ ఉండేది కాదు. తమిళ పరిశ్రమలో శంకర్ వంటి స్టార్ డైరెక్టర్స్ రజని వంటి టాప్ సూపర్ స్టార్స్ తో భారీ సినిమాలు నిర్మిస్తూ సౌత్ చిత్ర పరిశ్రమపై ఆధిపత్యం చెలాయించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ప్రస్తుతం టాలీవుడ్ సౌత్ లోనే కాకుండా దేశంలోనే ఎక్కువగా భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించే స్థాయికి చేరుకుంది.

దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి తో ఈ సంప్రదాయాన్ని మొదలుపెట్టి, “ఆర్ ఆర్ ఆర్” తో కొనసాగిస్తున్నారు. మరో ప్రక్క యంగ్ డైరెక్టర్ సుజీత్ ప్రభాస్ హీరోగా నిర్మిస్తున్న “సాహో” టాక్ అఫ్ ది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీగా మారిపోయింది. అలాగే డైరెక్టర్ గుణశేఖర్ రానా హీరోగా “హిరణ్య కశిప” అనే భారీ పౌరాణిక మూవీ తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది.ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ చిత్రం కూడా త్వరలోనే సెట్స్ పైకెళ్లే అవకాశం కలదు. ఇక తాజాగా నేడు మెగా నిర్మాత అల్లు అరవింద్ “రామాయణ” అనే భారీ పౌరాణిక చిత్రాన్ని మూడు భాగాలుగా మూడు భాషలలో నిర్మించనున్నట్లు ప్రకటించారు. పైన చెప్పిన ప్రతి సినిమా బడ్జెట్ 300కోట్ల పై బడే ఉండటం గమనార్హం. ఒక ప్రాంతీయ భాషా సినీపరిశ్రమ చెందిన చిత్రాలను ఇంత బడ్జెట్ తో తెరకెక్కించడం సాహసమనే చెప్పాలి.ఇలా టాలీవుడ్ వరుసగా భారీ చిత్రాలు నిర్మిస్తూ భారతీయ సినీ పరిశ్రమపై తన ముద్ర వేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు