కన్నడ బ్యూటీతో జడీకట్టనున్న యంగ్ హీరో !
Published on May 22, 2017 8:54 am IST


గతేడాది ‘చుట్టాలబ్బాయి’ చిత్రంతో పర్వాలేదనిపించిన యంగ్ హీరో ఆది ఈ సంవత్సరం దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో సందీప్ కిషన్, నారా రోహిత్, సుధీర్ బాబులతో కలిసి ‘శమంతకమణి’ అనే మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ చిత్రీకరణలో అందగానే అయన మరో సినిమాకి సిద్ధమవుతున్నారు. నూతన దర్శకుడు విశ్వనాధ్ అరిగెళ్ల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు.

కన్నడ బ్యూటీ శ్రద్ధ శ్రీనాథ్ ఆడికి జోడీగా నటించనుంది. జూన్ 2వ వారంలో అధికారికంగా లాంచ్ కానున్న ఈ ప్రాజెక్ట్ యొక్క రెగ్యులర్ షూట్ జూన్ 3వ వారం నుండి మొదలుకానుంది. ఇకపోతే ఈ చిత్రాన్ని విజయ లక్ష్మి, చరణ్ తేజ్ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

 
Like us on Facebook