
క్రికెటర్‌గా తన కెరీర్లో ఊహించని పరిణామాలతో అనిశ్చితి వచ్చాక కొన్నాళ్ళకు ఆ ఫీల్డ్‌కు గుడ్‌బై చెప్పిన శ్రీశాంత్, సినిమాల ద్వారా కొత్త కెరీర్‌కు ప్లాన్ చేసుకున్న విషయం తెలిసిందే! ఆ క్రమంలోనే ఆయన కొంత వర్క్ చేసుకున్నాక తాజాగా ఓ ద్విభాషా చిత్రాన్ని చేసేందుకు సిద్ధమైపోయారు. తెలుగు, తమిళ భాషల్లో సానా యాదిరెడ్డి ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇక ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త హల్‌చల్ చేస్తోంది.
క్రికెట్‌లో వివాదాస్పద వ్యక్తిగా మారిపోయిన ఓ క్రికెటర్ హీరోగా మారి సినిమా తీస్తున్నాడంటే, ఆ ప్రాజెక్టుపై సాధారణంగానే అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలతో పాటు ఈ సినిమాకు గ్లామర్ అంశాన్ని కూడా జోడిస్తే సినిమాకు తిరుగుండదన్న ఆలోచనతో ఈ సినిమాకు ఓ టాప్ హీరోయిన్‌ను సెలెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ జరుగుతున్న ప్రచారం మేరకు తమన్నా, కాజల్.. ఇద్దరిలో ఎవరో ఒకరిని సంప్రదించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయమై ఓ స్పష్టత వచ్చే అవకాశముంది.