ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో ఇద్దరు టాప్ హీరోయిన్స్ !

ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా ఈ నెల రెండో వారం నుండి హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ ప్రారంభం కానుంది. తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో ఒకప్పటి ఇద్దరు స్టార్ హీరోయిన్లు హీరో, హీరోయిన్లకు అమ్మలుగా కనిపించబోతున్నారని సమాచారం. లయ, మీన వంటి హీరోయిన్స్ ఈ పాత్రల్లో నటించే అవకాశం ఉంది. అయితే ఎవరు నటిస్తున్నారనే విషయంపై ఇంకా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.

తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను హారికా హాసిని క్రియేషన్స్ సంస్థలో చినబాబు నిర్మిస్తున్నాడు. ఎన్టీఆర్ ఈ సినిమా కోసం తన లుక్ ను పూర్తిగా మార్చుకోవడం జరిగింది. జగపతిబాబు ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. వినోద్ సినిమాటోగ్రఫి అందిస్తోన్న ఈ సినిమాకు సంభందించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.