నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లయన్’. బాలకృష్ణ మరోసారి ద్విపాత్రాభినయం చేయనున్న ఈ సినిమా ఆడియో వేడుక నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకలవేదికలో ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆడియో రిలీజ య్యింది. ఈ వేడుకలో ‘లయన్’ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసారు. ఆ ట్రైలర్ కి మరియు ట్రైలర్ లో బాలయ్య చెప్పిన పవర్ఫుల్ డైలాగ్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.
ముఖ్యంగా కొత్త డైరెక్టర్ అయిన సతి దేవా బాలకృష్ణని అభిమానులు ఎలా కోరుకుంటారో అనత పవర్ఫుల్ గా చూపించడం మరియు బాలయ్య నుంచి ఆశించే పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ లు, డైలాగ్స్ చెప్పించడంతో అభిమానులు చాలా హ్యాపీగా ఉన్నారు. బాలకృష్ణ గాడ్సే, బోసు పాత్రల్లో కనిపించనుండగా, త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్స్ గా కనిపించనున్నారు. మణిశర్మ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి రుద్రపాటి రమణారావు నిర్మాత. ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
లయన్ ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


