ఈ నెల 30న వస్తున్న ‘టాప్ ర్యాంకర్స్’..!

ఈ నెల 30న వస్తున్న ‘టాప్ ర్యాంకర్స్’..!

Published on Jan 24, 2015 8:26 PM IST

Top-rankers
విశ్వావిజన్ ఫిల్మ్స్ పతాకంపై నటకిరీటి డా.రాజేంద్ర ప్రసాద్ హీరోగా గొళ్ళపాటి నాగేశ్వరరావు దర్శకత్వంలో పసుపలేటి బ్రహ్మం నిర్మించిన సినిమా ‘టాప్ ర్యాంకర్స్’. ప్రస్తుత విద్యా విధానంపై సెటైరికల్ గా కొత్త కథ, కథనంతో ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ గా రూపొందించిన ఈ సినిమాను జనవరి 30న విడుదల చేస్తున్నట్టు నిర్మాత తెలిపారు.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. తెలుగు చిత్ర సీమ చరిత్రలో ఇలాంటి సినిమా రాలేదు. సినిమాలో అన్ని సన్నివేశాలు కొత్తగా ఉంటాయి. ఒక్క సన్నివేశం అయినా, మరొక సినిమాలో సన్నివేశానికి దగ్గరగా ఉంది అని ఏ ఒక్కరు చెప్పినా, లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తామని చెప్పారు.

అశోక్ కుమార్, సోని చరిష్టా, శివాజీ రాజా. గిరిబాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. జయసూర్య ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు