ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో ‘షారుక్ ఖాన్’ !

Published on May 1, 2019 8:45 pm IST

ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో ‘మెంటల్ హై క్యా’ అనే ఓ హిందీ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో కంగనా రనౌత్, రాజ్ కుమార్ రావులు ప్రధాన పాత్రలుగా నటిస్తున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కూడా ఓ అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇక ఈ ‘మెంటల్ హై క్యా’ చిత్రాన్ని జూన్ 21వ తేదీన విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. కాగా ప్రకాష్ గత చిత్రం ‘సైజ్ జీరో’ కూడా బాగానే ఆడింది. మరి ఇప్పుడు రాబోతున్న ఈ హిందీ చిత్రం కూడా హిట్ అవుతుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More